AP: నంద్యాల జిల్లా, బనగానపల్లె మండలం బీరువలి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త వెంకట స్వామి తన భార్య లక్ష్మి (36)ని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకట స్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.