హైదరాబాద్ బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో పనిచేస్తున్న కమర్షియల్ పైలట్ రోహిత్ శరణ్ (60)పై మహిళా అసిస్టెంట్ పైలట్ (26) పై లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదు చేసింది. ఈ నెల 20న బిజినెస్ ఫ్లైట్‌లో బెంగళూరు వెళ్లినప్పుడు, అక్కడ ఓ హోటల్ గదిలో నిందితుడు తనపై అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ప్రతిఘటించి హైదరాబాద్ చేరుకున్న ఆమె బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన బెంగళూరు పరిధిలో జరిగినందున కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేశారు.