TG: హైదరాబాద్‌లోని నారాయణగూడ వైఎంసీఏ సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ఆటోలో గ్యాస్ నింపుతుండగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మరో ఆటోకు వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు ఆటోలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పెట్రోల్ బంకు సిబ్బందికి గాయాలయ్యాయి, వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు, పెట్రోల్ బంకుకు మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పింది.