జమ్మూకశ్మీర్‌లో హైదరాబాద్‌ జవాను మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్‌లోని శాలిబండ ప్రాంతానికి చెందిన సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సురీందర్ సింగ్ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. తోటి సిబ్బంది అతడిని జైనాపురలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్