TG: ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ను వేదికగా మార్చాలనేది తన సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ, ఐటీ, ఫార్మా పరిశ్రమల మాదిరిగానే ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేస్తామని, సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల కష్టాలు తనకు తెలుసునని, వారి కోసం వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.