కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యంతో 480 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అయన మాట్లాడారు. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలో ఉన్నారని, పంటలు ఎండకుండా నీళ్లు వదులుతారని గవర్నర్ నోటి వెంట మాట వస్తదని ఆశగా ఉన్న రైతులకు నిరాశే మిగిలిందని చెప్పుకొచ్చారు.