అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) 77వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొని ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కమల్ సురేష్, ఓయూ అధ్యక్షుడు దృహన్, శివ శంకర్, అన్వేష్, భాస్కర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.