జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన 'దిష్టి' వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గతంలో చేగువేరా వేషం ధరించి విప్లవకారుడిగా చెప్పుకున్నారని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నందున 'దిష్టి' వంటి పదాలు వాడుతున్నారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు రేకెత్తించేలా ఉన్నాయని, కాబట్టి ఆయనను వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.