సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు

హైదరాబాద్‌లోని గాంధీనగర్ డివిజన్‌లో సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్  జన్మదిన సందర్భంగా ఆయన విగ్రహానికి యువ నాయకుడు ముఠా జయసింహ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పడంలో, ఉద్యమానికి దిశానిర్దేశం చేయడంలో జయశంకర్ చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్ కుమార్, పోతుల శ్రీకాంత్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ముఠా నరేష్, ఉన్న సత్యనారాయణ, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్