మాజీ ఎంపీ వి.హనుమంత్ రావు కోరిక మేరకు, అంబార్‌పేట్ బతుకమ్మ కుంటలో రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మాజీ ఎంపీ హనుమంతరావుతో కలిసి చేప పిల్లలను పంపిణీ చేశారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని మెట్టు సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, నాయకులు శ్రీకాంత్ గౌడ్, నారాయణ స్వామి, దిద్ది రాంబాబు, గరిగంటి రమేష్, శ్రీధర్ గౌడ్, కోటం అనిల్ పాల్గొన్నారు.