ప్రతి ఒక్కరూ సర్వే ప్రక్రియకు సహకరించాలి

లాలపేటలో SIR సర్వే కార్యక్రమంలో భాగంగా, ఇంటింటికి వెళ్లి ఓటర్లను గుర్తించి, వారికి సంబంధించిన పత్రాలను అందించారు. బీజేపీ తార్నాక డివిజన్ ప్రధాన కార్యదర్శి మడ ప్రమోద్ కుమార్, వినోబా నగర్ బూత్ ప్రెసిడెంట్ నాగరాజ్, రజని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు సర్వే ప్రక్రియకు సహకరించాలని, బీఎల్ఓ, బీఎల్ఏలను సంప్రదించి ఫారాలు నింపి, కొత్త ఫోటోలు జతచేయాలని కోరారు. 2002లో ఓటు వేసిన వారి తండ్రి ఎపిక్ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలు అవసరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్