మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదల.. ఓయూలో సంబరాలు

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదల కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్వీ నేతలు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కాటం శివ, కొంపల్లి నరేష్, నాయకులు నాగేందర్ రావు, రామకృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్