గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2026 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 2వ తేదీన శుక్రవారం విడుదల కానున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువాహటి ఈ విషయాన్ని ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష స్కోర్‌కు మూడేళ్లపాటు విలువ ఉంటుంది. అభ్యర్థులు గరిష్ఠంగా 2 పేపర్ల వరకు పరీక్ష రాయవచ్చు.