ఉస్మానియా యూనివర్సిటీలో హోళీ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, స్టూడెంట్ యూనియన్ల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగులు పూసుకుంటూ, కేరింతలు కొడుతూ ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు కూడా పాల్గొని విద్యార్థులతో కలిసి హోళీ ఆడారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది.