పాల్వంచలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన రోషిత్ పటేల్ అనే విద్యార్థి మృతి చెందాడు. భద్రాచలం నుండి తిరిగి వస్తున్న 8 మంది విద్యార్థులతో కూడిన ఆటో, జాతీయ రహదారిపై కారును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.