హైదరాబాద్ నార్సింగిలో అరెస్ట్ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు బలప్రయోగంతో అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణాలకు అనుమతిస్తే, దాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. పెద్దల పక్షానే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. దీనిపై జాగృతి న్యాయపోరాటం చేస్తుందని తెలిపారు.