చేయి చేయి కలిపి కేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కేరళ వయానాడ్ లో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. ఆపదలో ఉన్న వారికి మానసిక ధైర్యాన్ని మనవంతు ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యత అని అన్నారు. వరదల వల్ల కొండచరియలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఎన్నో కుటుంబాలు చిన్నా బిన్నమయ్యాయని అవేదన వ్యక్తం చేశారు.