ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు సమాధి దుస్థితిపై ఓ నటి ఆవేదన వ్యక్తం చేయడంతో, హీరో మంచు మనోజ్, గీతా ఆర్ట్స్ సంస్థ రంగంలోకి దిగాయి. శనివారం మంచు మనోజ్ తన అనుచరులతో కలిసి దాసరి సమాధి వద్దకు చేరుకుని, శుభ్రపరిచే పనులు ప్రారంభించారు. గీతా ఆర్ట్స్ సంస్థ కూడా తమ బృందాన్ని పంపి, సమాధి పునరుద్ధరణ పనులను మొదలుపెట్టింది. చెట్లు మొలిచి, పాడుబడ్డ స్థితిలో ఉన్న సమాధి వీడియోను చూసి వీరు స్పందించారు.