తెలంగాణలో 6 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు: వయోపరిమితి పెంపుతో నిరుద్యోగులకు ఊరట

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం, ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 6,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో 1,300కు పైగా అధ్యాపక పోస్టులు, దేవాదాయ, అటవీ, సర్వే సెటిల్‌మెంట్, DIETలలో 100కు పైగా ఖాళీలు, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్, PET పోస్టులు, ఆర్టీసీ, పురపాలక శాఖల్లోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ ఖాళీల వివరాలను సమీక్షించేందుకు సర్వీస్ కమిషన్ పాలక మండలి త్వరలో సమావేశం కానుంది.

సంబంధిత పోస్ట్