మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ఆడనున్న రేవంత్ రెడ్డి

ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడు మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్‌బాల్ ఆడనున్నారు. ముచ్చర్లలోని భారత్ ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్‌లో ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రమోట్ చేయడంతో పాటు, 500 కంపెనీల నుండి వెయ్యి మందికి పైగా గ్లోబల్ డెలిగేట్లు పాల్గొంటారు. 'తెలంగాణ అంటే భవిష్యత్ భారతానికి గర్వకారణం' అనేది ఈ సమ్మిట్ ప్రధాన థీమ్.

సంబంధిత పోస్ట్