హైటెక్ సిటీలో ఒక యువకుడు కదులుతున్న బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ల్యాప్‌టాప్ తెరిచి, స్క్రీన్ వైపు చూస్తూ ప్రమాదకరంగా డ్రైవింగ్ చేశాడు. 'వర్క్ ఫ్రమ్ బైక్' అంటూ నెటిజన్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తనతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసేలా ప్రవర్తించాడని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.