కారు ఢీకొని అన్నాచెల్లెళ్లు మృతి

హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. దసరా పండుగ కోసం శంషాబాద్ నుంచి తన చెల్లి రేఖను తీసుకుని వస్తున్న నవీన్ ప్రయాణిస్తున్న స్కూటీని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లెళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕