లాజిస్టిక్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ 'హై పెర్ఫార్మర్'

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ లాజిస్టిక్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించి 'హై పెర్ఫార్మర్'గా నిలిచింది. లీడ్స్-2025 నివేదికలో రాష్ట్ర పనితీరును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వేగవంతమైన నిర్ణయాలు ఈ పురోగతికి కారణమని అధికారులు భావిస్తున్నారు. హర్యానా, ఛత్తీస్‌గఢ్, బిహార్ వంటి రాష్ట్రాలతో సమానంగా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జలమార్గాల వినియోగంపై తెలంగాణ చూపుతున్న దృష్టిని, పారిశ్రామిక పార్కుల్లో లాజిస్టిక్స్ మౌలిక వసతులకు కేటాయింపులను కేంద్రం ప్రత్యేకంగా ప్రశంసించింది.

సంబంధిత పోస్ట్