హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ రైళ్లు: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లకు ఆమోదం తెలిపింది. ఇందులో హైదరాబాద్ నుంచి మూడు కారిడార్లు నిర్మించనున్నారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె మార్గాల్లో ఈ రైళ్లు నడపాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం రైల్వేశాఖ ఈ కారిడార్లపై కసరత్తులు చేస్తోంది. లొకేషన్ సర్వే, డీపీఆర్ తయారీకి అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో భూసేకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి నిర్మించనున్న బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

సంబంధిత పోస్ట్