కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి (35) రైలు ఢీకొని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. జూకాల్ - ఉందానగర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ వీఎల్ చారి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.