హైద‌రాబాద్‌లో రన్నింగ్ బైక్‌పై రెచ్చిపోయిన ప్రేమ జంట

హైదరాబాద్ రోడ్లపై రాత్రి ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించారు. ఆరాంఘర్‌ ఫ్లైఓవర్ పై ప్రియురాలిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని ప్రియుడు వేగంగా దూసుకెళ్లాడు. యువతి బైక్ నడుపుతున్న ప్రియుడిని కౌగిలించుకొని కూర్చింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. ఈ జంటపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్