రేపు అరంఘార్-జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభం: ఎమ్మెల్యే

నియోజకవర్గ ప్రజలకు బహదూర్ పూరా ఎమ్మెల్యే మమ్మద్ ముబీన్ శుభవార్త చెప్పారు. అరంఘర్ నుంచి జూపార్క్ వరకు నిర్మించిన ఫ్లై ఓవర్ ను రేపు ప్రారంభించనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రూ. 799. 74 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిందన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్