సులేమాన్ నగర్ పరిధిలోని మారిటల్ పంక్షన్ హాల్ రోడ్డు అధ్వానంగా తయారైంది. ఇటీవల వర్షానికి రోడ్డు కొట్టుకుపోయి గుంతలమయం కావడంతో వర్షపు నీరు గుంతల్లో చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పలువురు వాహనదారులకు ప్రమాదాలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి నూతన రోడ్డు వేయాలని లేదా మరమ్మతు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.