కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే కోపంతో భర్త తన భార్యను, ఆమె ప్రియుడిని కత్తితో పొడిచి గాయపరిచిన సంఘటన వెలుగు చూసింది. ఇద్దరికీ పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. భార్య చేతిపై, ప్రియుడి కడుపులో గాయపరిచిన భర్త, రక్తం మడుగులో ఉన్న ప్రియుడిని, ప్రియురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.