హైదరాబాద్: గ్యాస్ దొరకడం లేదని ఆటో డ్రైవర్లు ఆందోళన

హైదరాబాద్ నగరంలో ఆటో ఎల్పీజీ గ్యాస్ కొరత గత రెండు వారాలుగా తీవ్రమైంది. ఈ సమస్యతో ఆటో డ్రైవర్లు గంటల తరబడి ఎదురుచూసి విసిగిపోయారు. సాగర్ రింగ్ రోడ్డు, LB నగర్, బహదూర్‌పురా, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో డ్రైవర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. తమ జీవనోపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నప్పటికీ, సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు కొనసాగిస్తామని డ్రైవర్ల సంఘాలు హెచ్చరించాయి.

సంబంధిత పోస్ట్