రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం వేడుకలు నిర్వహించాలని సూచించింది. మండల, జిల్లా కేంద్రాల్లో సంబరాలు చేసుకోవాలని చెప్పింది. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.