హైదరాబాద్‌లో ఎస్సీ ఉప కులాల నేతలతో కవిత సమావేశం

హైదరాబాద్‌లో సోమవారం ఎస్సీ ఉప కులాల నేతలతో సమావేశమైన ఎమ్మెల్సీ కవిత, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈమేరకు తీర్మానం చేయాలని, విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ ఉప కులాలకు రిజర్వేషన్లు దక్కాలని ఆమె కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల పెంపునకు జాగృతి దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని కవిత తెలిపారు.

సంబంధిత పోస్ట్