యువ న్యాయవాది స్వప్న దారుణ హత్య: ఆస్తి తగాదాలే కారణమా?

హైదరాబాద్ పరిధిలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో యువ న్యాయవాది స్వప్న (34) దారుణ హత్యకు గురయ్యారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్నకు ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఇటీవల పొలం కొలతలు జరిగిన తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్తుండగా, ఆమె అన్నతో పాటు మరో ఇద్దరు కలిసి గొంతు కోసి హత్య చేశారని సమాచారం. స్వప్నపై గతంలో రెండుసార్లు హత్యాయత్నం జరిగినట్లు ఆమె తల్లి వెంకటమ్మ తెలిపారు. మొయినాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్