ఫిలింనగర్ క్లబ్‌లో ఎన్టీఆర్ లెజెండరీ అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, సినీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు కళాకారులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి చిత్ర ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అవార్డు గ్రహీతలను కళామతల్లి ముద్దుబిడ్డలని కొనియాడిన బండి రమేష్, వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.