ఐపీఎల్ మ్యాచ్‌ల జోష్: ఏఎంఆర్ ప్లానెట్‌లో భారీ స్క్రీనింగ్

హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల సందడి పెరిగింది. కుషాయిగూడ సమీపంలోని ఏఎంఆర్ ప్లానెట్ మాల్‌లో ప్రత్యేకంగా ఐపీఎల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. టెర్రస్‌పై భారీ స్క్రీన్‌తో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని భావిస్తున్నారు. ప్రవేశం ఉచితమని ప్రకటించడంతో పలు ప్రాంతాల క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

సంబంధిత పోస్ట్