ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక దబ్బేడ ప్రణీత్ (27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన ప్రణీత్, రామంతపూర్ వెంకటరెడ్డి నగర్ కాలనీలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అక్క వివాహం తర్వాత కుటుంబంపై ఆర్థిక భారం పెరిగినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. మృతుడి తల్లి దబ్బేడ పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.