దోమలను నివారిస్తే వ్యాధులు దరిచేరవని బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డి అన్నారు. దోమల నివారణ కోసం శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో దోమల ఆవాసాలు లేకుండా విద్యార్థులు చొరవ తీసుకోవాలని ఆమె సూచించారు. వర్షాకాలంలో దోమల బెడదతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని కార్పొరేటర్ సూచించారు.