చర్లపల్లి రైల్వేట్రాక్‌పై తల్లి పిల్లల ఆత్మహత్య.. UPDATE

చర్లపల్లి రైల్వేట్రాక్‌పై తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున గూడ్స్‌ రైలు కింద పడి ముగ్గురు మరణించారు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి, తల్లి సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరితనమే ఈ ఘోర నిర్ణయానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పిల్లలను తీసుకొచ్చి, కారులో సూసైడ్‌ నోట్‌ రాసి, వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టి, రైల్వేట్రాక్‌పైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం బీబీనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్