బాలాపూర్ లో అక్రమంగా నిల్వచేసిన రైస్ గోదాంలో అధికారుల దాడులు

బాలాపూర్ పోలీస్ పరిధిలోని సుల్తాన్‌పూర్ ప్రాంతంలో అక్రమ గోదాంపై పోలీసులు, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 523 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 69 క్వింటాళ్ల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌కు నష్టం కలిగిస్తూ రేషన్‌ను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో జిల్లా సివిల్ సప్లైస్ అధికారి వనజాత, ఏఎస్ఓ రాజేంద్రనగర్ వి. పుల్లయ్య, సివిల్ ఇన్స్పెక్టర్ మహేష్ పాల్గొన్నారు. బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్