ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ప్రాంగణంలో గల నవగ్రహ దేవతా ఆలయంలో, 31 జనవరి 2026 శనివారం రోజున శనిత్రయోదశి సందర్భంగా భక్తులు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి, నల్లటి వస్త్రంతో అలంకరించి, నల్ల నువ్వులు, అరటి పండ్లు, బెల్లం నైవేద్యంగా సమర్పించారు. టెంకాయలు కొట్టి, నవగ్రహాల చుట్టూ 19 ప్రదక్షిణలు చేశారు.