వీధి కుక్కల స్వైరవిహారం.. ఏడేళ్ల చిన్నారిపై దాడి (వీడియో)

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని శివగంగా కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై 10 వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి చెవి ఊడిపోయి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టి చిన్నారిని కాపాడారు. గాయపడిన చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రోజూ ఇలాంటి దాడులు జరుగుతున్నా GHMC అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్