మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తోటకూర వజ్రెష్ యాదవ్ నియమితులయ్యారు. మంగళవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లు వజ్రెష్ యాదవ్ కు నియామక పత్రం అందజేశారు. రాబోయే గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నూతన అధ్యక్షుడు అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీని జిల్లాలో బలమైన శక్తిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.