ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో, నౌషీన్ జ్యూస్ సెంటర్ ఎదురుగా ఉన్న ప్యాసింజర్ ఆటోలో ఝంగీర్ (24) మరియు ఇర్ఫాన్ (25) అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్