నగరంలోని పాతబస్తీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, పోలీసులు తనిఖీ చేయగా ఆ వ్యక్తి వద్ద నాటు తుపాకీ లభించింది. ఈ వస్తువు ఆ వ్యక్తి వద్దకు ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.