నాచారం డివిజన్ శ్రీరాంనగర్‌లోని బంగారు మైసమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవం ఉప్పల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముందుగా ఈ వార్షికోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేకు స్థానికులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.