బీహార్‌లో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన ప్రకటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. తేజస్వీ 2.75 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానంటున్నారని, కనీసం రూ.25వేల జీతం ఇవ్వాలంటే రూ.8.28 లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ బీహార్ ప్రభుత్వ బడ్జెట్ కేవలం రూ.2 లక్షల కోట్లు మాత్రమేనని ఓవైసీ ఎద్దేవా చేశారు. ప్రజలు అమాయకులు కాదని, తేజస్వీ మాటలను నమ్మరని ఆయన అన్నారు.