కేంద్రం తెలంగాణకు ఐదేళ్లలో రూ.3.76 లక్షల కోట్లు విడుదల

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి రూ.3,76,175 కోట్ల నిధులు విడుదలయ్యాయి. బీజేపీ ఎంపీ అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ, కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో, రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.4,35,919 కోట్లు ఆదాయం వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్