పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇటీవల నగరంలోని ఓ బాధితుడిని మోసం చేసి రూ. 1. 11 కోట్లను నేరగాళ్లు కాజేశారు. బాధితుడి పిర్యాదుతో డిల్లీ వెళ్లి నిందితులను ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా పలు సైబర్ నేరాలకు నిందితులు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు.