బోనాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయ ప్రార్థన మందిరంలో దేవాలయాల కమిటీ ప్రతినిధులకు బోనాల చెక్కులను అందజేశారు. తెలంగాణ బోనాల పండుగకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. ఈ వేడుకలు ఐక్యమత్యాన్ని చాటి చెబుతాయని పేర్కొన్నారు.