అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 'లీడర్‌షిప్ ఇన్ 21వ శతాబ్దం' కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకుంటున్నారు.